Homeతెలంగాణహైదరాబాద్ రియల్ రంగంలో సంచలనం...! మోడీ బిల్డర్స్ భారీ జ‌రిమాన‌...!

హైదరాబాద్ రియల్ రంగంలో సంచలనం…! మోడీ బిల్డర్స్ భారీ జ‌రిమాన‌…!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో అనూహ్య పరిణామం. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించి.. తప్పుడు ప్రచారాలతో ఆకర్షించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మోడీ బిల్డర్స్, దాని అనుబంధ సంస్థలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ భారీ షాక్ ఇచ్చింది. లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీగా ప్రచారం చేస్తూ విక్రయాలు జరిపి.. అధికారికంగా మాత్రం ప్లాట్ల లేఅవుట్ గా నమోదు చేసిన ఉదంతంలో.. నిబంధనల ఉల్లంఘనను తెలంగాణ రేరా తీవ్రంగా స్పందించింది. ఏకంగా 20 లక్షల భారీ జరిమానా విధించింది. ఇచ్చిన ఆదేశాలను గడువులోగా పాటించకపోతే రేరా చట్టంలోని సెక్షన్ 63 కింద మరిన్ని కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏం జరిగిందంటే…

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయ్యారా పరిధిలోని గోల్డెన్ కౌంటి ప్రాజెక్టుకు సంబంధించి ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఆ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన మహమ్మద్ ఉస్మాన్ సహా మరో 26 మంది బాధితులు సంయుక్తంగా రేరా అధారిటీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మోదీ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోడీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు తమ బ్రోచర్లు, ప్రచారాల్లో ఈ ప్రాజెక్టును అత్యాధునిక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ల్యాండ్ స్కేప్ పార్కులతో కూడిన లగ్జరీ విల్లాగేటెడ్ టౌన్ షిప్ గా మార్కెటింగ్ చేశాయని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు హెచ్ఎండిఏ నుంచి కేవలం ప్లాటెడ్ లేఅవుట్ కు మాత్రమే అనుమతులు ఉన్నాయి . రేరా వద్ద కూడా ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్టుగానే రిజిస్టర్ చేసి తమను ఘోరంగా మోసం చేశారని బాధితులు ఆధారాలతో సహా నిరూపించారు.

తీర్పు చెంపపెట్టు…

అయితే బాధితుల నుంచి ఈ ఫిర్యాదు రావడంతో బిల్డర్ యాజమాన్యం తమను తాము సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. కొనుగోలుదారులకు ఈ విషయం ముందే తెలుసు అని బుకాయించే ప్రయత్నం చేసింది. ప్లాట్ కొనుగోలుకు, విల్లా నిర్మాణానికి వేరువేరుగా రెండు ఒప్పందాలు చేసుకున్నామని.. బుకింగ్ ఫారాల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉందని వాదించింది. అయితే ఈ వాదనలను టీజీ రేరా ధర్మాసనం తోసి పుచ్చింది. ఒప్పందం చేసుకునే ముందు ప్రజలకు కొనుగోలుదారులకు చూపించే ప్రకటనలు, మార్కెటింగ్ మెటీరియల్ ఒకరకంగా ఉండి.. క్షేత్రస్థాయిలో మరోరకంగా విక్రయించడం పూర్తి చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పేరు, మోడల్ విల్లాలు, ప్రచార తీరును బట్టి చూస్తే సంస్థ ఉద్దేశం, విల్లా టౌన్షిప్ ను విక్రయించడమేనని తేటతెల్లమవుతుందని.. రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారులను మభ్య పెట్టేందుకు బిల్డర్లు అనుసరిస్తున్న డ్యూయల్ అగ్రిమెంట్ ఎత్తుగడలను రేరా తప్పు పట్టింది. 20 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఈ తీర్పు ఒక సంచలనంగా మారింది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు