Homeతెలంగాణ'పట్టభద్రుల' ఎన్నికల్లో జనసేన...!

‘పట్టభద్రుల’ ఎన్నికల్లో జనసేన…!

  • హైదరాబాద్- రంగారెడ్డి స్థానంలో అభ్యర్థి

  • బిజెపికి ఇబ్బంది కరం

  • వేర్వేరుగా పోటీతో ఉభయ పార్టీలకు నష్టం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బిజెపి సిద్ధపడుతోంది. కానీ అక్కడ జనసేన ను కలుపుకొని వెళ్ళేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి జనసేన ఇప్పటికే డాక్టర్ గడల శ్రీనివాస్ రావు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే అక్కడ తమ అభ్యర్థికి బిజెపి షరతుగా మద్దతు ఇస్తుందని జనసేన నాయకత్వం గట్టిగా భావించింది. కానీ కమలనాధులు కనీస సానుకూలత చూపలేదు. అందుకే జనసేన బిజెపికి కంచుకోటగా భావించి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలోనూ నేరుగా పోటీకి దిగాలని నిర్ణయించింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమే.

వ్యూహాత్మక ఎంపిక…

జనసేన వ్యూహాత్మకంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానంలో డాక్టర్ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ముందుగానే ఖరారు చేసింది. ఆయనకు హెల్త్ డైరెక్టర్ గా విస్తృత పరిచయాలు ఉన్నాయి.. అందుకే ఆ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకుంటామన్న భీమా కనిపిస్తోంది. ఏపీ తరహా లోనే తెలంగాణలోనూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేనకు కేటాయించి.. బిజెపి మద్దతు ప్రకటిస్తే ఉమ్మడిగా విజయం సాధించవచ్చు అని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం జనసేనను పరిగణలోకి తీసుకోలేదు. ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తోంది. తమ ప్రతిపాదనలను బిజెపి ఏమాత్రం పట్టించుకోకపోవడం, కనీస చర్చలకు కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. మిత్రపక్షంగా తాము మాత్రం ఎందుకు త్యాగాలు చేయాలన్న భావన జనసేన తెలంగాణ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి దారితీసింది.

అభ్యర్థిగా డాక్టర్ న్యూటన్…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన తెలంగాణ విభాగం తమ వ్యూహానికి పదును పెట్టింది. పార్టీ తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల స్థానంలో డాక్టర్ న్యూటన్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసింది. నగర పరిధిలోని విద్యావంతుల్లో బిసి, క్రిస్టియన్, మైనారిటీ ఉద్యోగ వర్గాల ఓట్లు గణనీయంగా ఉన్నందున.. సామాజిక సమీకరణలో భాగంగా డాక్టర్ న్యూటన్ ను బరిలో దించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన భావిస్తోంది. ప్రత్యేకించి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం. జనసేన పోటీలోకి రావడం బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇదే స్థానం నుంచి బరిలో దిగనున్న బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర చీఫ్ రామచంద్రరావుకు ఇది ఇబ్బందికరమే. జనసేన అభ్యర్థి రంగంలోకి దిగడంతో ఆయన గెలుపు పై తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు