Homeతెలంగాణకాంగ్రెస్ కు తగ్గిన ఆదాయం...! అమాంతం పడిపోయిన విరాళాలు ...

కాంగ్రెస్ కు తగ్గిన ఆదాయం…! అమాంతం పడిపోయిన విరాళాలు …

  • కేవలం రూ. 130.39 కోట్లకు పరిమితం

  • బిజెపికి తిరుగులేని సాయం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తుంటాయి. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఆదాయం సమకూరుతుంది. తాజాగా భారత ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన తాజా విరాళాల నివేదిక ఆసక్తికరమైన గణాంకాలను వెలుగులోకి తెచ్చింది. అయితే ఈ విరాళాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో పొందిన రూ.517.39 కోట్ల విరాళాలు పొందిన కాంగ్రెస్.. 2025 – 26 నాటికి ఈ విరాళాల మొత్తం ఏకంగా 75% పడిపోయింది. కేవలం రూ.130. 69 కోట్లకు పరిమితం అయింది. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీ పొందిన విరాళాల్లో అతి తక్కువ మొత్తం కూడా ఇదే. కాంగ్రెస్ విరాళాలు ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఫ్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి వచ్చిన నిధులు గణనీయంగా తగ్గడమే. గతంలో ఇదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్కు రూ.216.34 కోట్లు వరకు విరాళాలు వచ్చాయి. కానీ ఈసారి కేవలం 25 కోట్లకు ఆ మొత్తం విరాళం చేరుకుంది.

విరాళాలు ఇచ్చింది వీరే…

కాంగ్రెస్ పార్టీకి లభించిన ప్రధాన విరాళాల్లో స్టార్ సిమెంట్స్ 5 కోట్లు, సజ్జన్ భజన్ కా నాలుగు కోట్లు, ప్రేమ్ కుమార్ భజంక రెండు కోట్లు లభించాయి. కాంగ్రెస్తో పోల్చుకుంటే అధికార బిజెపికి భారీగా విరాళాలు వచ్చాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజెపి ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ప్రకారం.. ఇలా వచ్చిన విరాళాలు 6000 కోట్ల రూపాయల వరకు బిజెపి కి లభించినట్లు తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ సేకరించిన విరాళాల మొత్తానికి దాదాపు 12 రెట్లు. కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గుముఖం పడుతుండడం విశేషం.

జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధికారానికి దూరమై దాదాపు పుష్కరకాలం దాటుతోంది. వరుసగా పదేళ్లపాటు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్. 2004 నుంచి 2014 వరకు ఆ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం చేపట్టింది. ఆ సమయంలో భారీగా విరాళాలు ఉండేవి. జాతీయస్థాయిలో అధికారంలో ఉండడమే కాదు.. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. సహజంగానే పారిశ్రామిక వర్గాల వారు రాజకీయ పార్టీలకు విరాళాలు అందిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్కు తగ్గి బిజెపికి భారీగా ఎదుగుదల కనిపించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు