బెంగుళూరు, క్రైమ్‌మిర్రర్: చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగికి యజమాని కుమార్తెతో సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇంట్లో కూతురితో కలిసి ఉన్న అతడిని పట్టుకొని నిర్బంధించి బ్యాట్‌తో చితకబాది హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది. కుమార్తె గదిలో ఉండగా పట్టుకొని నిర్బంధించి బ్యాట్‌తోక చితకబాది అంతమొందించాడు. తమిళనాడుకు చెందిన ఆనంద్ రాజ్, గత కొన్నేళ్లుగా బెంగళూరులో స్వీట్ కార్న్ మెషిన్ తయారు చేసే ఒక చిన్న కర్మాగారాన్ని నడుపుతున్నాడు. సుమారు రెండేళ్ల కింద కేరళకు చెందిన కిరణ్‌ను పనిలో చేర్చుకున్నాడు.
కాగా, ఆనంద్ రాజ్ కుమార్తె మైసూరులో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నది. దసరా సెలవుల కోసం ఆమె ఇంటికి వచ్చింది. ఈ సమయంలో కిరణ్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ విషయం తెలిసి ఆనంద్ రాజ్ అసంతృప్తిగా ఉన్నాడు.మరోవైపు నవంబర్ 2న భార్యతో కలిసి తమిళనాడులోని తన స్వగ్రామానికి వెళ్తున్నానని ఆనంద్ రాజ్ తన కుమార్తెకు చెప్పాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం తన భార్యతో కలిసి యలహంకలోని ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కుమార్తెతో కలిసి కిరణ్ ఒక గదిలో ఉండటాన్ని ఆనంద్ రాజ్ చూశాడు.
ఆగ్రహించిన అతడు ఇంట్లో ఉన్న గదిలో అతడ్ని బంధించాడు. భార్య, కుమార్తెను చిక్కబళ్లాపురంలోని బంధువు ఇంటికి పంపాడు.ఆ తర్వాత ఆనంద్ రాజ్ తన ఇంట్లో బంధించిన కిరణ్‌ను రాత్రంతా బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అతడి కడుపు కింది భాగంలో తన్నడంతో కిరణ్ కుప్పకూలిపోయాడు. ఆనంద్ రాజ్ ఆటోలో ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యజమాని ఆనంద్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగి కిరణ్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
