Homeక్రైమ్తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కుమ్మరికుంట కాలనీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరికుంట కాలనీకి చెందిన పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), ఆయన భార్య అప్పల నరసమ్మ (53) దుస్తులు ఆరేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలినట్లు సమాచారం. ఈ క్రమంలో నరసమ్మ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆమెను ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన భర్త బంగారయ్య కూడా విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.

also read: ఢిల్లీలో దారుణం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై కత్తితో దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు