-
మారనున్న షెడ్యూల్
-
ముంచుకొస్తున్న భారీ వర్షాలే కారణం
-
వర్ష తీవ్రతబట్టి ఎన్నికల సంఘం నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీకి తుఫాన్ ముప్పు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండం గా మారి.. అత్యంత ప్రమాదకరమైన తుపానుగా రూపాంతరం చెందుతోంది. దానికి ఆర్నాబ్ తుఫానుగా నామకరణం చేశారు. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ చూడని తీవ్రతతో ఇది తుఫానుగా విరుచుకు పడే అవకాశం ఉంది. అక్టోబర్ 28 నాటికి తీవ్ర, పెను తుపాను గా మారి ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల మధ్య తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల కు పైగా వేగంతో వీచే ప్రచండ గాలులు, కుండ పోత వర్షాలతో పట్టణ/ గ్రామీణ ప్రాంతాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అయ్యింది.
సుప్రీం ఆదేశాలతో…
ఈ భారీ విపత్తు ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పునరుద్ధరణ కారణంగా మున్సిపల్ పోలింగ్ షెడ్యూల్ ఒకటో తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు తుఫాన్ ముప్పు పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తొలితా ప్రకటించిన పాత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్ జరగాల్సి ఉండగా.. సరిగ్గా అదే రోజున తుఫాను తీరాన్ని తాకి అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.
ఎన్నికలపై ప్రభావం…
వర్షాల తీవ్రతతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రచారం పూర్తిగా స్తంభించి పోవడం ఖాయంగా తెలుస్తోంది. ముఖ్యంగా తీర పట్టణాలు, గోదావరి లంక గ్రామాలు నేత మునిగే ప్రమాదం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి తరలింపు అధికార యంత్రాంగానికి సవాలుగా మారనుంది.
గోదావరి.. కృష్ణా జిల్లాల్లో …
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి కూడా తుఫాన్ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ మూడున్నర జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. తుఫాను దాటిన తర్వాత గోదావరి, కృష్ణ డెల్టా పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం, విద్యుత్ స్తంభాలు నేలపోలడం, రహదారులు తెగిపోవడం వంటి నష్టాలు మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతాయి. మొత్తం ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇవి కూడ చదవండి:
- అమెరికా పోలీసులకు చిక్కిన ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు
-
భర్తల చేతిలో భార్యల హతం.. ! శివన్నగూడెంలో వరుస హత్యల కలకలం…
-
కాళేశ్వరం చెక్పోస్ట్ వద్ద ధాన్యం అక్రమ రవాణాకు చెక్…!
-
అనుమతి లేకుండా ఫోటోలు తీశారు…! అలా చేయడంతో మానసికంగా ప్రభావం చూపింది…అనుపమ
