హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: అమెరికా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు వీసా వస్తుందోరాదో అని కలత చెందిన యువకుడు ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని అత్తాపూర్‌లో తేజస్వీనగర్‌లో 26 ఏళ్ల రోహిత్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లందేకు నిర్ణయించుకొని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటిసారి దరఖాస్తు రిజక్ట్ అయింది. కాగా రెండో సారి వీసా కోసం సదరు యువకుడు ఎదురు చూపులు చూస్తున్నటు్ల తెలుస్తుంది.
వీసా వస్తుందో రాదోనని తల్లిదండ్రులతో కూడపలుమార్లు చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో యువకుడి ఆత్మహత్యకు వీసా ఆందోళనే కారణమై ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అత్తాపూర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికొచ్చిన కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఇవి కూడ చదవండి:
- రజనీ – కమల్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం?
-
ఏపీలో వాయుగుండం కలకలం.. నేటి నుంచి విస్తారంగా భారీ వర్షాలు!
-
వైభవ్‌ను టీమ్ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t
-
వైసీపీని కలవర పెడుతున్న ఎంఐఎం!
