క్రైమ్ మిర్రర్, సినిమా:- తన హిందీ యాస పై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, సౌత్ ఇండియన్ యాసను సమస్యగా చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
“నేను పుట్టి పెరిగింది సౌత్ ఇండియాలోనే, కాబట్టి నా మాటల్లో సౌత్ ఇండియన్ యాస రావడం చాలా సహజం. సౌత్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆ యాస ఎందుకు ఉండకూడదో, దాంట్లో తప్పేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అలా ఉండటం తప్పని భావించడం ఎంతమాత్రం సరికాదు” అని రష్మిక స్పష్టం చేశారు.
రజనీ – కమల్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం?
సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నానని ఆమె వాపోయారు. తన నటన, పెర్ఫార్మెన్స్, మాట్లాడే భాష, చివరకు యాసపై కూడా కొందరు నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, విమర్శలను అధిగమిస్తూ తన పనిపైనే దృష్టి పెడతానని రష్మిక పునరుద్ఘాటించారు. ప్రతిభకు ప్రాంతీయ యాస అడ్డంకి కాకూడదని, భాష కంటే భావవ్యక్తీకరణే ముఖ్యమని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
వైభవ్‌ను టీమ్ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t
