Homeసినిమారజనీ - కమల్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం?

రజనీ – కమల్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం?

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇండియన్ సినిమా రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, స్టార్ హీరోలు రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.యువ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్‌లో ఈ భారీ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఒక ప్రమోషనల్ వీడియో విడుదల కావడం విశేషం. అయితే ఆ తర్వాత నుంచి సినిమా గురించిన ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రాకపోవడంతో, ఈ మూవీ అటకెక్కిందనే రూమర్స్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గట్టిగా నడిచాయి.

ఏపీలో వాయుగుండం కలకలం.. నేటి నుంచి విస్తారంగా భారీ వర్షాలు!

అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ, వచ్చే నెలలో షూటింగ్ నిర్వహించడానికి దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా మూవీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, వచ్చే డిసెంబర్ నుంచి ఈ షూటింగ్‌లో కమల్ హాసన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం అందింది. ఇద్దరు లెజెండరీ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వైభవ్‌ను టీమ్‌ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు