Homeక్రీడలువైభవ్‌ను టీమ్‌ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t

వైభవ్‌ను టీమ్‌ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీమ్‌ఇండియా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ, తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంచ్ కే పరిమితం కావడం వల్ల అతడిలోని అద్భుతమైన టాలెంట్, మంచి ఫామ్ వృథా అవుతున్నాయని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వైభవ్‌ను భారత జట్టు బెంచ్‌పై కూర్చోబెట్టే బదులు, స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసి రంజీ ట్రోఫీలో ఆడించడం మంచిదని సూచించారు. దానివల్ల అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించి మరింత మెరుగవుతాడని అభిప్రాయపడ్డారు.అయితే మరోవైపు, జట్టులోని సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టలేమని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైభవ్ స్థానంపై చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

వైసీపీని కలవర పెడుతున్న ఎంఐఎం!

డిప్యూటీ సీఎంను కూడా వదల్లే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు