క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు గతంలో వచ్చిన వార్తలు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే, కాలక్రమేణా ఈ ప్రాజెక్ట్ రద్దయిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ రూమర్ల వల్ల ఐకాన్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ ఊహాగానాలకు తెరదించుతూ, తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్వయంగా ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్‌తో కలిసి ఆయన కథా చర్చలు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒక్క ఫొటోతో ఈ క్రేజీ కాంబోపై వస్తున్న అన్ని రకాల నెగెటివ్ రూమర్లకు చెక్ పడినట్లయింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ రానున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ గుడ్ న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇతర ప్రాజెక్ట్‌ల షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ క్రేజీ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు మాత్రం తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వెదర్ మ్యాన్
