దేశీయ మార్కెట్‌లో సిమెంట్ కొనుగోలుదారులకు చేదు వార్త అందుతోంది. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సిమెంట్ ధరలను పెంచేందుకు తయారీ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ Emkay Research వెల్లడించింది. ఈ పెంపు నిర్ణయం ఈ వారంలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.రాబోయే పండుగల సీజన్ ప్రారంభం కావడంతో పాటు, మార్కెట్‌లో డిమాండ్-సర్పరా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కంపెనీలు భావిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచే ఒక్కో సిమెంట్ బస్తాపై రూ. 10 నుండి రూ. 15 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకేసారి ఎక్కువ నీరు తాగుతున్నారా? అయితే జాగ్రత్త!
గత 6 నుండి 7 నెలలుగా ముడిసరుకుల (రవాణా, బొగ్గు, ఇతర ఇంధనాలు) ధరలు నిరంతరం పెరుగుతుండటం సిమెంట్ పరిశ్రమకు తీవ్ర భారంగా మారింది. ఈ వ్యయ భారం కంపెనీల నికర ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో, అనివార్య పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ మరియు ప్రభుత్వ ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుండగా, ఈ కొత్త ధరల పెంపు భవన నిర్మాణదారులకు మరియు సామాన్య వినియోగదారులకు అదనపు భారాన్ని మోపనుంది.
