-
పది రోజుల తర్వాత వెలుగులోకి
-
మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుటుంబంలో తీవ్ర విషాదం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీకి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు ఎంఏ గపూర్ కుమారుడు కిరణ్ అమెరికాలో అకస్మాత్తుగా మృతి చెందారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గా ఉన్న ఎంఏ గపూర్, ఐద్వా నేత నిర్మలమ్మ దంపతుల కుమారుడు కిరణ్. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న ఆయన వయసు 41 సంవత్సరాలు. ఆయన మరణించి దాదాపు పది రోజులు గడుస్తోంది. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం ఎన్నారై వర్గాలను, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రముఖ పేపాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్ గా పని చేస్తున్నారు కిరణ్. గపూర్ దంపతులకు ఏకైక కుమారుడు కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆ దంపతులు.
విద్యాధికుడు…
కిరణ్ విద్యాధికుడు. చెన్నైలోని ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఆపై న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఒంటరిగానే నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గుండెపోటు రావడంతో నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ చనిపోయారు. గుర్తు తెలియని మృతదేహం గానే ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేశారు. అయితే పది రోజుల తర్వాత ఆయన మరణ విషయం తెలియడానికి ఒంటరి జీవనమే కారణం. కొద్ది రోజులుగా ఆయన ఆఫీసుకు కూడా హాజరు కావడం లేదు. ఎవరి ఫోన్ కు స్పందించడం లేదు. దీంతో స్నేహితులు, సహ ఉద్యోగులు ఆయన ఇంటికి వెళ్లేసరికి అసలు విషయం తెలిసింది.
గతంలో ఎమ్మెల్యేగా…
ఎంఏ గపూర్ సిపిఎం లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో కర్నూలు ఎమ్మెల్యేగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రి మార్చరీలో ఉన్న మృతదేహాన్ని ఫోన్లో వీడియోలో చూపించగా కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. ఏకైక కుమారుడు ఆకస్మిక మరణంతో గఫూర్ కుటుంబం తీవ్రపుత్ర శోకంలో మునిగిపోయింది. తానా తో పాటు ఇతర ఎన్నారై సంఘాల ప్రతినిధుల సహకారంతో కిరణ్ భౌతిక కాయాన్ని త్వరలో కర్నూలుకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా కిరణ్ ఆకస్మిక మృతి పై వామపక్షాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గఫూర్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఇవి కూడ చదవండి:
- ఢిల్లీలో నిరసనకారులపై హిందూ రక్షా దళ్ వ్యక్తుల దాడి.. నలుగురి అరెస్ట్
-
మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఐదుగురు మృతి
-
ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు: అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తుల రద్దీ!
-
అద్భుతం….ఇక కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్…! స్కానర్‌వైపు చూసి హలో జీయో అంటే చాలు….
