– రోజువారి విచారణకు హాజరు కావాల్సిందే
– తెరపైకి పాత కేసులు
– పట్టు బిగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
క్రైమ్ మిర్రర్, ఏపీ :-
జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు మళ్లీ ఉచ్చు బిగిస్తోంది. తెలంగాణ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన తాజా రిట్ పిటిషన్.. ఆయన రాజకీయ భవిష్యత్తును అత్యంత క్లిష్టమైన మలుపు తిప్పే లా ఉంది. సీబీఐ నమోదు చేసిన కేసులు విచారణ ఎప్పటికీ వస్తాయో తెలియదు కానీ.. ఈడి పి ఎం ఎల్ ఏ కేసుల విచారణ గనుక రోజువారి ప్రాతిపదికన ప్రారంభం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించడం ఖాయం. సిపిఐ సాధారణ క్రిమినల్ చట్టాల కింద పనిచేస్తే.. ఈడి అత్యంత కఠినమైన మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేరుగా ఆర్థిక నేరాలను డీల్ చేస్తుంది.
ఈడి చాలా సీరియస్..
సిబిఐ కేసులతో పోలిస్తే.. ఈడీ కేసులు చాలా సీరియస్. ఇక్కడ చట్టపరమైన బాధ్యత పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణ న్యాయ సూత్రాల ప్రకారం నేరం జరిగినట్టు దర్యాప్తు సంస్థ నిరూపించాల్సి ఉండగా.. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 24 ప్రకారం నేను తప్పు చేయలేదు.. నా కంపెనీలో వచ్చిన డబ్బులు అక్రమమైనవి కావు అని స్వయంగా నిందితుడే కోర్టుకు నిరూపించుకోవాలి. అరబిందో, హేటరో, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లో వాస్తవ విలువ కంటే అధిక ప్రీమియంతో జరిగిన షేర్ల కొనుగోళ్లు, బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రయల్ ఆధారాలు ఈడి వద్ద పూర్తిగా పక్కాగా ఉన్నాయి. సిబిఐ కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు, వారి విశ్వసనీయత పై ఆధారపడాల్సి వస్తే.. ఈడీ కేసుల్లో డాక్యుమెంటరీ సాక్షాలు, డిజిటల్ లెడ్జెర్లు, బ్యాంకు రికార్డులే ప్రధానం. అందువల్ల ఈడీ కేసుల్లో తప్పించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం.
12 సంవత్సరాలుగా బెయిల్ పై..
అక్రమాస్తుల కేసుల్లో గత 12 సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో ఆయన లీగల్ టీం చక్కగానే పనిచేసింది. అయితే ఇప్పుడు ఈడీ వేసిన ఈ స్పీడ్ బ్రేకర్ నుంచి బయటపడేందుకు ఆ టీం ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడు చూడాలి. మరోవైపు తప్పకుండా జగన్ లీగల్ టీం గట్టిగానే ఆలోచన చేస్తుంది. ప్రిడికేట్ అపెన్స్ వాదన తప్పకుండా జరుగుతుంది. సిబిఐ మోపిన మూల నేరం తేలకుండా.. ఇది నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులపై విచారణ జరపడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టులో తీర్పులను ఉటంకిస్తూ.. హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సిబిఐ కోర్టులో అసలు అవినీతి జరిగిందా లేదా అన్నది తేలే వరకు ఈ డి విచారణను నిలిపివేయాలని కోరడం లేదా రెండు ఒకేసారి జరగాలని కోరుతూ కౌంటర్ పిటిషన్లు వేయడం జగన్ లీగల్ టీం ముందు ఉన్న ఎత్తుగడ.
ఇన్నేళ్లు అడ్డుకుంటూ..
జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఏళ్ల తరబడి విచారణను అడ్డుకుంటూ వస్తున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ సాగదీతకు జగన్ టీం ప్రయత్నించే అవకాశం ఉంది. ఈడీ దాఖలు చేసిన తొమ్మిది ప్రాసిక్యూషన్ ఫిర్యాదులతో నిందితులుగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు, బ్యూరోక్రాట్లు, ఇతర సహ నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వీటిపై కింది కోర్టు తుది నిర్ణయం తీసుకోకుండా రోజువారి విచారణ ఎలా ప్రారంభిస్తారు అనే ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యేక సిపిఐ కోర్టు ఈ డిస్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తే.. వెంటనే హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టేట్ తెచ్చుకోవడం ద్వారా విచారణను మరో ఐదు ఆరు నెలల పాటు వాయిదా వేయించే వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం జగన్ సహజంగానే ప్రయత్నిస్తారు. తాను ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధినేతను అని.. ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉందని.. భద్రతా కారణాలు, రాజకీయ షెడ్యూల్ను చూపిస్తూ ఈ మినహాయింపు కోరే అవకాశం ఉంది. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగానే కాదు చట్టపరంగాను కూడా సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు.
