Homeక్రైమ్న‌గ‌రంలో ఘ‌రాన మోసం...! త‌ప్పిపోయిన కొడుకునంటూ వృద్దుడికి గాలం...! చివ‌ర‌కూ...

న‌గ‌రంలో ఘ‌రాన మోసం…! త‌ప్పిపోయిన కొడుకునంటూ వృద్దుడికి గాలం…! చివ‌ర‌కూ…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: 24ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన కొడుకును నేనేనంటూ వృద్దుడిని మోసం చేసేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు కేటుగాళ్ల‌ను పోలీసులు అరెస్టు చేసిన ఘ‌ట‌న ఇబ్ర‌హీం ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. దీంతో ఆప్రాంతంలో ఈ ఘ‌ట‌న చ‌ర్ఛానీయాంశంగా మారింది. సాధువు అవతారంలో వచ్చిన ఓ వ్యక్తి.. తానే తప్పిపోయిన కొడుకునంటూ వృద్ధుడిని నమ్మించే ప్రయత్నం చేశాడు. కాగా మ‌రికొంద‌రూ కూడ వృద్దుడిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో సాధువు వేషంలో ఉన్న వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

కాగా వృద్దుడు తన కొడుకుకు సంబంధించిన కుటుంబ వివరాలను అడగడంతో నకిలీ కొడుకు అడ్డంగా దొరికిపోయినట్లు సమాచారం. దీంతో మోసగాళ్ల వ్యవహారంపై వృద్ధుడు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మోహన్‌రెడ్డి, యాదయ్యపై BNS 318(4), 319(2) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. అంబులెన్స్ ఆటో ఢీ…! తెలంగాణ మ‌హిళ మృతి…
  2. బాలిక‌పై అత్యాచారం…! ఫోక్సో కేసు న‌మోదు…
  3.  ఏనుగు దంతాల ముఠా అరెస్టు…! 17కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం…
  4. కొకాపేటలోవ‌డ్డీ వ్యాపారి దారుణ హత్య…!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు