Homeక్రైమ్అంబులెన్స్ ఆటో ఢీ...! తెలంగాణ మ‌హిళ మృతి...

అంబులెన్స్ ఆటో ఢీ…! తెలంగాణ మ‌హిళ మృతి…

కాకినాడ‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: కాకినాడ జిల్లాలో ఆటోను అంబులెన్స్ ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ‌కు చెందిన మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెల‌కొంది. తుని వద్ద తిమ్మాపురం జాతీయ రహదారిపై మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను అంబులెన్స్ బలంగా ఢీకొట్టింది. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో సేవ చేసిన అనంతరం తిరిగి తలుపులమ్మలోవ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వామి వారి సేవకురాలు అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళలు. తిరుపతి నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న అంబులెన్స్.. వీరి ఆటోను ఢీకొట్టింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఎంతో భక్తితో స్వామివారికి సేవ చేసి తిరిగి వస్తుండగా తమ తోటి మహిళ ప్రమాదంలో మృతిచెందడంతో మిగిలిన మహిళలు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు