హైదరాబాద్, క్రైమ్మిర్రర్:ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడిపై ఫోక్సో కేసు నమోదు అయింది. హైదరాబాద్లోని సనత్నగర్లో ప్రాంతంలో ఓ హోటల్లో పని చేస్తున్న బాలుడికి ఇన్స్టాగ్రామ్ ద్వరా బాధితురాలు పరిచయం కాగా అది కాస్తా ప్రేమగా మారగా బయట చాలా సార్లు కలుసుకున్నారు.
ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని బాలుడు బాలికను నమ్మించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలం తరువాత బాలుడు మొఖం చాటేశాడు. దీంతో విషయం తెలుసుకున్నబాలిక కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
