Homeసినిమాఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కాపీరైట్ వివాదంపై కీలక తీర్పు

ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కాపీరైట్ వివాదంపై కీలక తీర్పు

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దశాబ్దాల క్రితం విడుదలైన ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1980లో వచ్చిన తమిళ చిత్రం ‘మూడు పానీ’లో ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. అయితే పాటకు సంబంధించిన హక్కుల విషయంలో సంగీత దర్శకుడి పరిధి ట్యూన్ లేదా సంగీత భాగానికే పరిమితమవుతుందని కోర్టు పేర్కొంది.

పాట సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన హక్కులు ఇళయరాజాకు చెందవని ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమా నిర్మాత నుంచి సౌండ్ రికార్డింగ్ హక్కులను పొందిన మ్యూజిక్ లేబుల్ సరిగమకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను ‘అగతియా’ సినిమాలో మరోసారి ఉపయోగించడంతో ఈ కాపీరైట్ వివాదం తెరపైకి వచ్చింది. పాటను రీక్రియేట్ చేయడంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేయగా.. హక్కుల విషయంలో వివాదం న్యాయస్థానానికి చేరింది.

తాజా తీర్పుతో సౌండ్ రికార్డింగ్ హక్కులకు సంబంధించి సరిగమకు అనుకూలంగా గతంలో వెలువడిన న్యాయపరమైన నిర్ణయం కొనసాగనుంది. దీంతో ఈ పాటకు సంబంధించిన హక్కుల వివాదంలో సరిగమకు కీలక ఊరట లభించినట్లైంది.

also read: యూట్యూబర్ రావణ్‌కు మరో షాక్.. ఉపా కేసులో దర్యాప్తు గడువు 30 రోజులు పొడిగింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు