Homeఆంధ్ర ప్రదేశ్యూట్యూబర్ రావణ్‌కు మరో షాక్.. ఉపా కేసులో దర్యాప్తు గడువు 30 రోజులు పొడిగింపు

యూట్యూబర్ రావణ్‌కు మరో షాక్.. ఉపా కేసులో దర్యాప్తు గడువు 30 రోజులు పొడిగింపు

యూట్యూబర్ రావణ్‌పై నమోదైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు దర్యాప్తు అధికారులకు మరో 30 రోజుల సమయం కల్పిస్తూ కృష్ణా జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

రావణ్‌పై నమోదైన ఉపా కేసులో చట్టపరంగా నిర్దేశించిన 90 రోజుల దర్యాప్తు గడువు అక్టోబర్ 2తో ముగియనుంది. అయితే కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, అదనపు ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు గడువును పొడిగించాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన కృష్ణా జిల్లా కోర్టు.. పోలీసుల అభ్యర్థనను అంగీకరించింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో 30 రోజుల గడువును మంజూరు చేసింది. దీంతో రావణ్‌పై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు పోలీసులకు అదనపు సమయం లభించింది.

మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని, సాయుధ విప్లవానికి మద్దతు ఇస్తున్నారని జనసేన నేత ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా జూలైలో పోలీసులు రావణ్‌ను అరెస్టు చేసి ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో దర్యాప్తు అధికారులు మరింత విచారణ కొనసాగించి, ఆధారాలను సేకరించిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.

also read: ఫడ్నవీస్‌కు అభిజీత్ దీప్కే వార్నింగ్.. ‘మూడు నెలలు జైల్లో పెట్టినా మళ్లీ వస్తా’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు