నెల్లూరు, క్రైమ్‌మిర్రర్: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ప్రమాదం కలువాయి మండలంలో వెంకటరామరాజుపేట వద్ద సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565 పై భైక్‌ను బలంగా ఢీకొట్టగా ఇద్దరు స్పాట్‌లోనే మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన షేక్ రసూల్ బాషా (47), మణికల సుధాకర్ (45) పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చింతలపాలెం గ్రామంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో రసూల్, సుధాకర్ మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడ చదవండి:
-
రాయలసీమకు భారీ ప్రోత్సాహం…! మంత్రి అచ్చెన్నాయుడు…
-
ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో సీజ్ బోర్డుల వెనుక సీక్రెట్ ఏంటి…?
-
రష్యా సైన్యంలో మనవారు…!
-
వివాహ బంధానికి దూరం… కెరీర్‌పైనే నటీమణుల పూర్తి దృష్టి!
