Homeక్రైమ్ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి భర్తపై దాడి చేయించిన భార్య.. ఐదుగురు నిందితులు అరెస్ట్

ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి భర్తపై దాడి చేయించిన భార్య.. ఐదుగురు నిందితులు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : తన భర్త మరొక మహిళతో కలిసి ఉన్నాడని తెలుసుకున్న ఓ భార్య, తీవ్ర ఆగ్రహంతో ముఠాను పురమాయించి వారిపై దాడి చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన ఓ వివాహిత వ్యక్తి, తన ప్రియురాలితో కలిసి కేరళలోని త్రిసూర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేశాడు. భర్త కదలికలపై అనుమానంతో ఉన్న భార్య, సాంకేతిక పరిజ్ఞానంతో అతడి మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసింది. ఆ సమాచారాన్ని ఒక ముఠాకు చేరవేసి, వారిని కేరళకు పంపింది.

పోలీసులమని చెప్పి లాడ్జి గదిలోకి ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులు, వారిద్దరినీ నిర్బంధించి నోటిలో గుడ్డలు కుక్కి బలవంతంగా కారులో తమిళనాడుకు తరలించారు. ప్రయాణంలో సదరు వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో అతడి చేతులు, కాళ్లు విరిగిపోయాయి. అనంతరం అతడిని తిరుప్పూర్ ఆసుపత్రి వద్ద వదిలేశారు.

అదే ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులు బాధిత మహిళను వేరే కారులోకి మార్చి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. భర్త లొకేషన్ ఆధారంగా ప్లాన్ వేసి ఈ నేరానికి పాల్పడిన భార్యతో పాటు, దాడికి పాల్పడిన గ్యాంగ్ సభ్యులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
also read : ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయా రెడ్డి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు