Homeసినిమామైత్రీ థియేటర్లలో ఇక సర్వపిండి.. సినిమా చూస్తూనే తెలంగాణ పల్లె రుచిని ఆస్వాదించే ఛాన్స్!

మైత్రీ థియేటర్లలో ఇక సర్వపిండి.. సినిమా చూస్తూనే తెలంగాణ పల్లె రుచిని ఆస్వాదించే ఛాన్స్!

సినిమా అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మైత్రీ థియేటర్స్ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వెండితెర వినోదానికి తెలంగాణ పల్లె వంటకాల రుచిని జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ థియేటర్లలో తెలంగాణకు ప్రత్యేకమైన సంప్రదాయ వంటకం సర్వపిండిని ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త కార్యక్రమాన్ని తొలిదశలో మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్లలో ప్రారంభిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రదర్శన సందర్భంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సినిమా ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు వేడివేడి సర్వపిండిని రుచి చూసే అవకాశం కల్పిస్తున్నారు.

సినిమా చూస్తూ సాధారణ స్నాక్స్ తీసుకోవడం చాలామందికి అలవాటే. అయితే తెలంగాణ సంప్రదాయ వంటకాన్ని థియేటర్‌లోనే అందించడం మాత్రం కొత్త అనుభూతిగా మారనుంది. దీంతో స్థానిక ఆహార సంస్కృతికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని మైత్రీ థియేటర్స్ భావిస్తోంది.

ఈ ఆలోచనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సోషల్ మీడియాలో ‘బామ్మాస్టోరిస్’ పేరుతో గుర్తింపు పొందిన 77 ఏళ్ల బామ్మ తయారు చేసే సర్వపిండి ఇప్పుడు థియేటర్ ప్రేక్షకులకు చేరువ కానుంది. చిన్న స్థాయి టిఫిన్ సెంటర్‌లో ఆమె తయారుచేసే ఈ సంప్రదాయ వంటకం.. ఇప్పుడు పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసే ప్రేక్షకుల మధ్యకు రావడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పల్లె రుచిని నగర ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు, సినిమా అనుభవంలో స్థానిక సంస్కృతికి చోటు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. సినిమా, సంప్రదాయ వంటకం కలయికలో మైత్రీ థియేటర్స్ తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

also read: నిమ్స్‌ డాక్టర్‌ ఇంట్లో “ఆపరేషన్స్‌…ఏసీబీకి ఆస్తుల షాక్ …! రూ.80 కోట్లకు పైగా సామ్రాజ్యం…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు