Homeఆంధ్ర ప్రదేశ్శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి

క్రైమ్ మిర్రర్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో విషాదకర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు యువకులను వేగంగా వచ్చిన రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో వారు తప్పుకునేందుకు అవకాశం లేకపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read : యుకే ఉద్య‌గాల పేరుతో నిరుద్యోగుల‌కు టోక‌రా…! యూట్యూబ‌ర్ నంద‌న పై కేసు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు