క్రైమ్ మిర్రర్ : విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం కేసు విచారణలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఈ విషయమై పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను వెంటనే సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, హైకోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు హైకోర్టులో ఎలాంటి విచారణలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
also read : పీఠాపురంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్…!మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న వైనం…
also read : పీఠాపురంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్…!మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న వైనం…
