Homeఆంధ్ర ప్రదేశ్చిత్తూరు జిల్లాలో విషాదం.. గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదం.. గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో గణేష్‌ నిమజ్జన ఊరేగింపు విషాదంగా మారింది. వి.కోట మండలం నాయకనేరి టోల్‌ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న భక్తులపైకి ఓ ఐషర్‌ వ్యాన్‌ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం పీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

also read: విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో కీలక మలుపు.. సిట్ ఎదుట ఏ4 నిందితుడి లొంగుబాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు