HomeసినిమాBigg Boss 20: నెలకు రూ.30 లక్షలు.. సల్మాన్‌కే షాకిచ్చిన గేమర్ తన్మయ్ సింగ్ ఆదాయం!

Bigg Boss 20: నెలకు రూ.30 లక్షలు.. సల్మాన్‌కే షాకిచ్చిన గేమర్ తన్మయ్ సింగ్ ఆదాయం!

ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 20’లో గేమర్, యూట్యూబర్ తన్మయ్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గేమింగ్ కంటెంట్ ద్వారా తాను ప్రతి నెల భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నట్లు ఆయన వెల్లడించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

షోలో భాగంగా తన్మయ్ సింగ్‌ను హోస్ట్ సల్మాన్ ఖాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతడి కెరీర్, గేమింగ్ రంగంలో సంపాదన గురించి సల్మాన్ ఆసక్తిగా ప్రశ్నించారు. నెలకు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని అడగ్గా.. తన్మయ్ ఆ మొత్తాన్ని సల్మాన్‌కు చెవిలో చెప్పాడు.

ఆ సంఖ్య విన్న సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం అందరి ముందు “నెలకు రూ.30 లక్షలా?” అంటూ తన్మయ్‌ను ప్రశ్నించడంతో అతడి ఆదాయం విషయం ప్రేక్షకులకు తెలిసింది.

తన సంపాదనకు సంబంధించి కూడా తన్మయ్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను పొందుతున్న ఆదాయం చట్టబద్ధమైన మార్గాల్లోనే వస్తుందని, వైట్ మనీ రూపంలోనే అందుకుంటానని చెప్పాడు. అలాగే చెల్లింపులు చెక్కుల ద్వారా జరుగుతాయని వివరించాడు.

తన్మయ్ సింగ్ ‘స్కౌట్‌ఓపీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛానెల్‌కు 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రధానంగా గేమింగ్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసే తన్మయ్.. వ్లాగ్స్‌ ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంటాడు.

గేమింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ద్వారా ఇంత భారీ స్థాయిలో ఆదాయం పొందుతున్నట్లు తన్మయ్ వెల్లడించడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.

also read: గణేశ్‌ ఉత్సవాల వేళ సైబర్‌ మోసాలపై అలర్ట్‌.. ఈ లింకులు క్లిక్‌ చేస్తే డబ్బులు గోవిందా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు