Homeక్రైమ్బాలాపూర్‌లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

బాలాపూర్‌లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. తనిఖీల సందర్భంగా సుమారు రూ.25 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడెక్కడ చలామణి చేశారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

నకిలీ నోట్ల చలామణిని అడ్డుకునేందుకు బాలాపూర్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

also read: 14 టోల్‌ప్లాజాలపై ఈడీ ఫోకస్‌.. అక్రమ సాఫ్ట్‌వేర్‌తో కోట్లాది రూపాయల మళ్లింపు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు