Homeసినిమా‘టాక్సిక్’పై నెగెటివ్ రివ్యూలకు చెక్.. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు!

‘టాక్సిక్’పై నెగెటివ్ రివ్యూలకు చెక్.. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు!

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాపై వచ్చిన విమర్శలు, ప్రతికూల సమీక్షలతో పాటు తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ చిత్ర బృందం న్యాయపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో బెంగళూరు కోర్టును ఆశ్రయించిన సినిమా నిర్మాతలు మధ్యంతర ఉత్తర్వులు పొందినట్లు సమాచారం. అనంతరం సినిమాపై నెగెటివ్ రివ్యూలు, సోషల్ మీడియా పోస్టులు చేసిన పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

నోటీసులు అందుకున్న వారిలో యూట్యూబర్ సూరజ్ కుమార్, తమిళ యూట్యూబర్ ప్రశాంత్ రంగస్వామితో పాటు మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నట్లు సమాచారం. తమకు న్యాయపరమైన నోటీసులు అందిన విషయాన్ని వీరు స్వయంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది.

సినిమాపై అభిప్రాయం వ్యక్తం చేయడం, సమీక్షలు ఇవ్వడం ఒకవైపు కొనసాగుతుండగా.. తప్పుడు సమాచారం లేదా నిరాధార ప్రచారం జరిగితే దానిపై చర్యలు తీసుకునే హక్కు నిర్మాతలకు ఉంటుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఇక ‘టాక్సిక్’కు సంబంధించి కోర్టు ఆదేశాలు, నిర్మాతల న్యాయపరమైన చర్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

also read: సన్నీ లియోన్ దంపతులకు భారీ ఊరట.. రూ.1.75 కోట్ల వివాదంలో కీలక తీర్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు