-
ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు
-
రోజంతా నడిచిన హైడ్రామా
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు విస్తృతంగా జరిగాయి. కడప జిల్లా పులివెందులతో సహా మొత్తం ఆరు చోట్ల శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేశారు. ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకొని హైదరాబాద్ తో పాటు పులివెందులలో తనిఖీలు కొనసాగాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి ఇళ్లల్లో సైతం తనిఖీలు జరగడం విశేషం. కేవలంవివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లల్లో మాత్రమే ఈడీ తనిఖీలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్, పులివెందులలో…
Also Read:2015 మైనర్ల అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు.. నిందుతులకు కఠిన శిక్షలు: ఐదుగురికి జీవిత ఖైదు
వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రేట్ విస్తృతంగా సోదాలు చేసింది. హైదరాబాద్ కోకాపేట, పులివెందులలో అవినాష్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. ప్రధానంగా మనీ లాండరింగ్.. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఈడి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈడి అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అవినాష్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్క అవినాష్ రెడ్డి ఇంట్లోనే కాదు.. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. తొండూరు మండలం తుమ్మలపల్లి లో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరిగాయి. పులివెందులలో జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.
సిబిఐ కాకుండా ఈడి…
Also Read: తెలంగాణలో బీజేపీకి ఇదే మంచి తరుణం…!
అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలో తనిఖీలు జరగడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మళ్లీ దర్యాప్తు మొదటి నుంచి ప్రారంభం అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎందుకు తనిఖీలు జరిపారు అన్నది నిర్దిష్టంగా తెలియలేదు. కానీ నిర్దిష్టంగా వారి ఇళ్లల్లోనే తనిఖీలు జరపడం మాత్రం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారణ చేపడుతోంది. అటువంటిది ఈడీ రంగంలోకి దిగడం ఏమిటనే చర్చ బలంగా వినిపిస్తోంది.
