Homeతెలంగాణలంకెబిందెల కోసం తవ్వుతున్నారేమో.. సెక్రటేరియట్ ముందు భారీ గుంతపై కేటీఆర్ సెటైర్

లంకెబిందెల కోసం తవ్వుతున్నారేమో.. సెక్రటేరియట్ ముందు భారీ గుంతపై కేటీఆర్ సెటైర్

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చకు దారితీస్తోంది. తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం సమీపంలో భారీ గుంత కనిపించడంతో ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. శివ అనే నెటిజన్ తన ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ అధికారుల తీరుపై ప్రశ్నలు సంధించారు. సచివాలయం వంటి అత్యంత రద్దీ ప్రాంతంలోనే ఇంత పెద్ద గుంత ఉండటం ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రతిరోజూ పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారని, ఎవరైనా గుంతను గమనించకుండా అందులో పడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డుపై ఇంత పెద్ద గుంత ఏర్పడినప్పటికీ దాన్ని ఎందుకు పూడ్చడం లేదని నెటిజన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ.. హుస్సేన్ సాగర్‌ను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా అంటూ సెటైర్ వేశారు. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించరా? ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాతే సమస్యలు గుర్తిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ గుంతను వీలైనంత త్వరగా మూసివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సచివాలయం వంటి కీలక ప్రాంతంలోనే రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే నగరంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో నగరంలో రోడ్ల నిర్వహణ, గుంతల సమస్య, జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
also read : విశాఖలో విషాదం.. ఇంట్లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు