Homeసినిమాభర్తను కాపాడేందుకు చివరి వరకు పోరాటం.. నటి మీనా ఎమోషనల్ కామెంట్స్!

భర్తను కాపాడేందుకు చివరి వరకు పోరాటం.. నటి మీనా ఎమోషనల్ కామెంట్స్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- సీనియర్ నటి మీనా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త విద్యాసాగర్ అనారోగ్యం, ఆయనను కాపాడుకునేందుకు తాము చేసిన ప్రయత్నాల గురించి ఆమె వివరించారు.బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన మీనా.. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది.వివాహం, కుటుంబ బాధ్యతల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దృశ్యం వంటి చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో 2022లో భర్త విద్యాసాగర్ మరణం ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది.తాజా ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. తన భర్త ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సిందేనని సూచించారని తెలిపారు. దాత కోసం చాలా కాలం ప్రయత్నించామని, ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు.

చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. మమిత బైజు నెక్స్ట్ టార్గెట్ అదేనా?

ఆయనను కాపాడుకోవాలనే ఆశతో చివరి వరకు ప్రయత్నించామని మీనా తెలిపారు. అవసరమైతే అమెరికాకు తీసుకెళ్లాలని కూడా అనుకున్నామని, అయితే విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అంత దూరం తరలించడం సాధ్యం కాదని వైద్యులు సూచించారని చెప్పారు. చివరి క్షణం వరకు పోరాడినా ఆయనను కాపాడుకోలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.భర్త మరణం తర్వాత తన జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదురయ్యాయని మీనా తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందినవారు తనకు అండగా నిలిచారని, వారి సహకారంతోనే ఆ బాధ నుంచి క్రమంగా బయటపడగలిగానని చెప్పారు.ప్రస్తుతం మీనా సినిమాలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె తమిళంలో మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా భర్త గురించి మీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పంచాయతీ కార్యదర్శి..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు