క్రైమ్ మిర్రర్,సినిమా:- నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీజర్ విడుదలైంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు టీజర్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని పోషించిన జడల్ పాత్ర, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.టీజర్ ప్రారంభంలోనే ఇక నుంచి ఈ జాగా మనదే… ఈ దేశం మనదే అంటూ జడల్‌గా నాని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. సమాజంలో అణచివేతకు గురైన వర్గం కోసం పోరాడే నాయకుడిగా నాని పాత్ర కనిపిస్తోంది. ఆధిపత్యం చెలాయించే శక్తులకు ఎదురొడ్డి నిలిచే యోధుడి కథగా సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.టీజర్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్‌ను చూపించారు. రక్తికట్టే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్, 1960ల నాటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఛీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా… కాకే దాని మీద గుర్తు… కాకులు తల్వార్లు పడితే ఏమవుతుందో చూపిద్దాం అంటూ నాని చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
డాబర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ‘100 శాతం’ క్లెయిమ్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలకు తాత్కాలిక స్టే
ఈ చిత్రంలో మోహన్ బాబు శికంజా మాలిక్ పాత్రలో కనిపించనుండగా, టీజర్‌లో ఆయన లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తున్నారు.SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలం చేకూర్చాయి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.ది ప్యారడైజ్ చిత్రం సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, బెంగాలీ భాషల్లో కూడా విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ఈ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ మరింత పెరిగిందనే చెప్పాలి. మరోవైపు సినిమాలో సౌండ్ ఎక్కువైంది అని.. మాటలు సారిగా వినిపించట్లేదు, దానికితోడు వైలెన్స్ ఎక్కువైంది అని భిన్నభిప్రాయాలు వస్తున్నాయి.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి..ఇదే మెగాస్టార్ టీమ్ ఫుల్ క్లారిటీ!
