Homeక్రైమ్భార్యపై అనుమానంతో హత్య... అనంతరం భర్త ఆత్మహత్య

భార్యపై అనుమానంతో హత్య… అనంతరం భర్త ఆత్మహత్య

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బేలూరు తాలూకా కెసగోడు గ్రామానికి చెందిన రఘు, గమన దంపతులు బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న రఘు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సమయంలో రఘు తన బంధువులకు వీడియో కాల్ చేసి భార్యను చంపబోతున్నట్లు తెలిపాడు. అనంతరం కారులోనే ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని రఘు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రఘు మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం గమన మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

also read: మాస్కోలో భారీ పేలుడు కలకలం.. రెస్టారెంట్ బయట బాంబు ఘటనలో ముగ్గురు మృతి, 21 మందికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు