Homeక్రైమ్ఒకే బ్యారెక్‌లో ఇద్దరు కిరాతక హంతక లేడీలు.. వణికిపోతున్న మహిళా ఖైదీలు

ఒకే బ్యారెక్‌లో ఇద్దరు కిరాతక హంతక లేడీలు.. వణికిపోతున్న మహిళా ఖైదీలు

క్రైం మిర్రర్ : విశాఖపట్నం సెంట్రల్ జైలులో ప్రస్తుతం ఉన్న ఇద్దరు మహిళా ఖైదీల కేసులు తీవ్ర చర్చకు దారితీశాయి. భర్తల హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు మహిళలు ఒకే బ్యారెక్‌లో ఉండటం జైలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. భర్త హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న మస్కన్, దామినిలను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌లో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిద్దరి కేసులు వేర్వేరైనా, నేరం జరిగిన తీరు కారణంగా సంచలనం సృష్టించాయి. మస్కన్‌పై భర్తను హత్య చేసిన కేసు నమోదైంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఆధారాలు సేకరించి ఆమెను అరెస్టు చేశారు.

మరో కేసులో దామిని తన భర్త హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పాముకాటుతో భర్త మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, ఆమెను నిందితురాలిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళా ఖైదీలు విశాఖ సెంట్రల్ జైలులోని మహిళా బ్యారెక్‌లో ఉన్నారు. వీరి భద్రత, ఇతర ఖైదీలతో సంబంధాలపై జైలు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు, న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. కోర్టు విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి పరిణామాలు ఉండనున్నాయి.
also read : “నీ ఫొటోలు భర్తకు పంపిస్తా”.. మహిళను బ్లాక్‌మెయిల్ చేసిన సెక్యూరిటీ గార్డు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు