హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: భారీ అంచనాల మధ్య జులై 3న థియేటర్లలో విడుదలైన నాగబంధం సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మైథలాజికల్ అడ్వెంచర్ చిత్రం జులై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా కనిపించారు. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, దక్ష నాగర్కర్, రిషభ్ సాహ్ని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అభిషేక్ నామ దర్శకత్వం వహించగా, నికి స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు.
Also Read:నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, నిందితుడిపై పోక్సో కేసు
విడుదలకు ముందు టీజర్, ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ‘నాగబంధం’ థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. విజువల్స్, గ్రాఫిక్స్‌కు ప్రశంసలు దక్కినా, స్క్రీన్‌ప్లే, నిడివి వంటి అంశాలు సినిమాపై ప్రభావం చూపాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పురాతన విష్ణు ఆలయాలు, నాగబంధం రహస్యాలు, బ్రహ్మ కమలం చుట్టూ సాగే ఈ మైథలాజికల్ అడ్వెంచర్ కథను థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం పొందనున్నారు. ఈ చిత్రం జులై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:70 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం, ఇద్దరు నిందితుల అరెస్ట్
