-
ఉమ్మడి మెదక్ జిల్లా కి ట్రబుల్ షూటర్ పరిమితం
-
హై కమాండ్ ఎందుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా?
-
పార్టీ శ్రేణుల్లో విస్మయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్నారు హరీష్ రావు. ఒక విధంగా పార్టీలో కేసీఆర్ తరువాత అంటే హరీష్ రావు గుర్తుకొస్తారు. కానీ మధ్యలో కేటీఆర్ ప్రవేశం చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ పార్టీలో ట్రబుల్ షూటర్ గా, పార్టీకి మైలేజ్ ఇచ్చే నాయకుడుగా హరీష్ రావు ది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. తాజాగా అయిన తన సొంత పాదయాత్ర చేపట్టారు. కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే చేసిన పాదయాత్రకు యావత్ రాష్ట్రాన్ని తన వైపు తిప్పుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా, పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. ఉద్యమ సమయం నుంచి పార్టీకి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడి పరిష్కరించడం ఆయనకు ఉన్న అలవాటు. అయితే అటువంటి నాయకుడి సేవలను పార్టీ హై కమాండ్ సక్రమంగా వినియోగించుకోవడం లేదనేది ఒక వాదన. హరీష్ రావును కేవలం తన సొంత నియోజకవర్గానికి, ఉమ్మడి జిల్లాకు మాత్రమే పరిమితం చేయడం పార్టీలో ఒక వర్గానికి రుచించడం లేదు.
క్షేత్రస్థాయిలో పట్టున్న నేత…
Also Read:“30 వేల అడుగుల ఎత్తులో షాక్.. ఒకేసారి ముగ్గురు పైలట్లకు అస్వస్థత!”
కెసిఆర్ తర్వాత క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడు హరీష్ రావు. ఇటీవల తన సిద్దిపేట పాదయాత్ర ద్వారా మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నారు. కాలేశ్వరం నీళ్లు, రైతాంగ సమస్యలపై ఆయన కేవలం ఒక మండల స్థాయిలో పిలుపునిచ్చారు. కానీ వేలాదిగా జనం తరలివచ్చారు. మీడియా బిల్డప్పులు లేవు. సోషల్ మీడియా ప్రచారాలు లేకుండా నేరుగా ఆయన ప్రజలతో మమేకమైన తీరు మాత్రం అభినందించదగ్గది. సోషల్ మీడియా హడావుడికే పరిమితమైన నేతల మధ్య.. రోడ్డెక్కి పోరాటం చేసే మాస్ లీడర్ గా ఆయనకు ఉన్న గుర్తింపు చెక్కుచెదరలేదు. అయితే ఈ స్థాయి క్రేజ్ చూసి సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేకులు ఆయనపై అనేక రకాల ముద్రలు వేస్తూ వస్తున్నారు.
వ్యూహాత్మక తప్పిదం…
Also Read:ఖమ్మంలో ముదురుతున్న రాజకీయ వివాదం…!
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమంత బాగాలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పుంజుకోవాలి. ఇటువంటి సమయంలో హరీష్ రావు సేవలను ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేయడం ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదం. హరీష్ రావుకు ఎలాంటి సరిహద్దు ఆంక్షలు విధించకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ లో వచ్చే ఊపు అసాధారణంగా ఉంటుంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు అభిమానులు, అనుచరులు ఉన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయడంలో కానీ.. క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమాయత్తం చేయడంలో గాని హరీష్ రావుకు ఉన్న రాజకీయ చాణుక్యం మరొకరికి లేదనడం అతిశయక్తి కాదు. కానీ హరీష్ రావును కావాలనే కట్టడి చేస్తున్నారని విమర్శ పార్టీలో ఉంది. అంతర్గత కుటుంబం, వారసత్వ రాజకీయ సమీకరణలతో అలా చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. అయితే ఇలానే హరీష్ రావును ఒక జిల్లాకు పరిమితం చేస్తే మాత్రం.. హరీష్ తో రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటున్న జాతీయ పార్టీలకు ప్రయోజనం. మరి ఆలోచించుకోవాల్సింది పార్టీ హై కమాండ్ మాత్రమే.