క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇటీవల సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజాగా ఇదే జాబితాలోకి టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రిన్స్ సెసిల్ చేరారు. ఇటీవల తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.ప్రిన్స్ సెసిల్ తనకు కాబోయే జీవిత భాగస్వామి సాయి మాచిరాజుతో నిశ్చితార్థం జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నాను అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ నిశ్చితార్థం గత నెలలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన ప్రిన్స్, ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు డేట్ ఫిక్స్..!
ప్రిన్స్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో సాయి మాచిరాజుతో ఆయనకు తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒకేలా ఉండటంతో ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం వరకు వారి ప్రయాణం చేరుకుంది. ఈ పరిచయంలో నటుడు ప్రియదర్శి కూడా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రిన్స్ షేర్ చేసిన ప్రపోజల్ వీడియోలో ప్రియదర్శి కూడా కనిపించారు.సాయి మాచిరాజు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో వారి వివాహాన్ని కూడా న్యూజిలాండ్‌లోనే నిర్వహించాలని రెండు కుటుంబాలు నిర్ణయించినట్లు సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రిన్స్ సెసిల్ దర్శకుడు తేజ తెరకెక్కించిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అనంతరం బస్ స్టాప్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో నేను శైలజ, డీజే టిల్లు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జన నాయకుడు పూర్తిగా భగవంత్ కేసరి రీమేక్ కాదు.. అసలు కథపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!