Homeఆంధ్ర ప్రదేశ్ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం.. సూసైడ్‌ నోట్‌తో మలుపు.!

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం.. సూసైడ్‌ నోట్‌తో మలుపు.!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ స్థాయికి ఎదిగిన ఉదయ్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉదయ్‌ కృష్ణారెడ్డి తనను లైంగిక వేధిస్తున్నాడంటూ మరో మహిళా ట్రైనీ ఐపీఎస్‌ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఈ ఫిర్యాదుతో ఇప్పటి వరకు హీరోగా ఉన్న ఉదయ్‌ కృష్ణారెడ్డి ఒక్కసారిగీ జీరోగా మారిపోయారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై శిక్షణ కేంద్రం అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఉదయ్‌ ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాశారు. ఈ నోట్‌లో అనేక కీలక విషయాలను పొందుపర్చినట్టు తెలిసింది. దీంతో లైంగిక వేధింపులు వ్యవహారానికి సంబంధించిన కేసు మరో మలుపు తీసుకున్నట్టు అయింది.

సంచలన ఆరోపణలతో నోట్‌..

ఆత్మహత్యకు పాల్పడిన ఉదయ్‌ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. తన బ్యాచ్‌ మేట్‌ అయిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో ఏడాది కాలంగా రిలేషన్‌లో ఉన్నట్టు లేఖలో వెల్లడించారు. ఆమెకు వివాహమైన తరువాత కూడా తమ ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ట్రైనీ ఐపీఎస్‌ అధికారి స్వయంగా తన గది వద్దకు వచ్చి తలుపు తీయమని గొడవ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్‌ ఫోన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న రిలేషన్‌, వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను మహిళా ట్రైనీ ఐపీఎస్‌ భర్తకు వివరించినట్టు అందులో వెల్లడించారు. ఈ సంభాషనలు, చాటింగ్‌లు, వీడియోలకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు తన ఫోన్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని లేఖలో స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటన మరో మలుపు తీసుకున్నట్టు అయింది. తాజాగా సూసైడ్‌ నోట్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి పేర్కొన్న అంశాలు ఆధారంగా శిక్షణ కేంద్రం అధికారులు విచారణ ప్రారంభించారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు