Homeక్రైమ్యాదగిరిగుట్ట లక్ష్మీపుష్కరిణిలో విషాదం.. నీట మునిగి ఆరేళ్ల చిన్నారి మృతి

యాదగిరిగుట్ట లక్ష్మీపుష్కరిణిలో విషాదం.. నీట మునిగి ఆరేళ్ల చిన్నారి మృతి

క్రైమ్ మిర్రర్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ప్రవీణ్ కుమార్, సంతోష దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణి వద్దకు వెళ్లగా, వారి ఆరేళ్ల కుమార్తె ఆద్యాంత ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.

చిన్నారి నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
also read : హత్య కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు