Homeక్రైమ్ఖమ్మంలో విషాదం.. బెదిరింపు ఫోన్లతో యువ న్యాయవాది బలవన్మరణం

ఖమ్మంలో విషాదం.. బెదిరింపు ఫోన్లతో యువ న్యాయవాది బలవన్మరణం

క్రైమ్ మిర్రర్ : పండగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువ న్యాయవాది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన తొలుపునూరి గణేశ్‌ (27) ఖమ్మం కోర్టులో జూనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గణేశ్‌ గత ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి తన అన్న సాయితేజతో కలిసి ముదిగొండ మండలం పెద్దమండవలోని అమ్మమ్మ పద్మావతి ఇంటికి వెళ్లాడు. పండగ సందర్భంగా మంగళవారం పద్మావతి, సాయితేజ ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గణేశ్‌ ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేశ్‌ చెప్పినట్లు అతని తండ్రి దానయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని కూడా తన కుమారుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న కుమారుడికి కొంత మార్పు కల్పించాలనే ఉద్దేశంతో అమ్మమ్మ ఇంటికి పంపించామని, ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రి ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గణేశ్‌ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఆయనను వెంబడించినట్లు చెబుతున్న వ్యక్తులు ఎవరు? ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినవారు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : బెంగళూరులో బిల్డింగ్ బ్లాస్ట్.. రంగంలోకి యాంటీ టెర్రరిజం స్క్వాడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు