Homeజాతీయంబెంగళూరులో బిల్డింగ్ బ్లాస్ట్.. రంగంలోకి యాంటీ టెర్రరిజం స్క్వాడ్

బెంగళూరులో బిల్డింగ్ బ్లాస్ట్.. రంగంలోకి యాంటీ టెర్రరిజం స్క్వాడ్

క్రైమ్ మిర్రర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

బెంగళూరులోని పులకేశినగర్ ప్రాంతంలో జార్మియా రోడ్డు వద్ద నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. భవనంలోని ఐదో అంతస్తులో పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రి వర్గాల ద్వారా పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌), ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ (ఐఎస్‌డీ), బాంబు నిర్వీర్య దళాల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో లభించిన అనుమానాస్పద వస్తువులను అధికారులు సేకరించారు. వాటిని విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే పేలుడుకు అసలు కారణం ఏమిటో స్పష్టమవుతుందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. సదరు భవనంలో కొంత భాగం ఇప్పటికే వినియోగంలో ఉండగా, మిగిలిన ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఫోరెన్సిక్ నివేదిక, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే పేలుడుకు గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో ట్విస్ట్.. అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు