Homeఅంతర్జాతీయంబంగాళాఖాతంలో విషాదం.. రోహింగ్యాల రెండు పడవలు మునక, 500 మందికి పైగా గల్లంతు?

బంగాళాఖాతంలో విషాదం.. రోహింగ్యాల రెండు పడవలు మునక, 500 మందికి పైగా గల్లంతు?

మయన్మార్‌కు చెందిన రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) ఆందోళన వ్యక్తం చేశాయి.

సమాచారం ప్రకారం.. రాఖైన్ రాష్ట్ర తీర ప్రాంతం నుంచి జూన్ చివరి వారంలో ఓ పడవ బయల్దేరింది. అందులో సుమారు 250 మంది రోహింగ్యాలు ఉన్నట్లు అంచనా. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ పడవతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇదే సమయంలో మరో ఘటనలో సుమారు 280 మంది ప్రయాణిస్తున్న పడవ జులై 8న అయేయార్వాడీ తీర ప్రాంతం సమీపంలో సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రమాదాల్లో ప్రయాణిస్తున్న వారిలో ఎవరూ సురక్షితంగా బయటపడకపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

రోహింగ్యాలు మయన్మార్‌లోని రాఖైన్ ప్రాంతంలో చాలా కాలంగా వివక్ష, హింస, భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక మంది మెరుగైన జీవనం కోసం సముద్ర మార్గాల్లో ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు తరచూ విషాదాలకు దారితీస్తున్నాయి.

also read: డేటింగ్ యాప్‌లకు బైబై.. సూపర్ మార్కెట్‌లోనే కొత్త పరిచయాలు! ఫిన్లాండ్‌లో వైరల్ అవుతున్న ‘పింక్ బాస్కెట్’ ట్రెండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు