Homeఅంతర్జాతీయంఅమెరికాలో టైమ్‌ మార్చే పద్ధతికి గుడ్‌బై? ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’కు ఆమోదం

అమెరికాలో టైమ్‌ మార్చే పద్ధతికి గుడ్‌బై? ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’కు ఆమోదం

అమెరికాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గడియారాల సమయ మార్పు విధానానికి త్వరలోనే ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం గడియారాలలోని సమయాలను రెండుసార్లు ముందుకు, వెనక్కి మార్చే ‘డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌’ విధానాన్ని శాశ్వతంగా మార్చేందుకు అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

also read: బండ్ల గణేశ్ ఆస్తి వేలం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత

‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 308 మంది సభ్యులు ఓటు వేయగా.. 117 మంది వ్యతిరేకించారు. భారీ మెజారిటీతో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడి ఆమోదం కోసం వెళ్లనుంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. గతంలోనే అధికారంలోకి వస్తే గడియారాల సమయాన్ని మార్చే విధానాన్ని రద్దు చేస్తానని ఆయన ప్రకటించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే సాయంత్రం వేళల్లో ప్రజలకు అదనపు వెలుతురు సమయం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌ అంటే ఏమిటి?

వేసవి కాలంలో సూర్యుడు సాధారణం కంటే ముందుగానే ఉదయిస్తాడు. ఉదయం వేళల్లో ఎక్కువ వెలుతురు ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కువ సమయం నిద్రలో గడుపుతారని భావించి.. గడియారాలను ఒక గంట ముందుకు మార్చే విధానాన్ని డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌ అంటారు.
అమెరికాలో సాధారణంగా వేసవి ప్రారంభంలో గడియారాలను ఒక గంట ముందుకు జరుపుతారు. దీనిని ‘స్ప్రింగ్ ఫార్వర్డ్’ అని పిలుస్తారు. శీతాకాలం ప్రారంభంలో మళ్లీ ఒక గంట వెనక్కి తీసుకువెళ్తారు. దీనిని ‘ఫాల్ బ్యాక్’ అంటారు.

ఈ విధానం వల్ల సాయంత్రం వేళల్లో ఎక్కువ సేపు సహజమైన వెలుతురు అందుబాటులో ఉంటుందని, విద్యుత్ వినియోగం తగ్గుతుందని గతంలో భావించారు. అయితే సమయ మార్పుల వల్ల నిద్ర, ఆరోగ్యం, రోజువారీ జీవన విధానంపై ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే అమెరికాలో ప్రతి ఏడాది జరిగే ఈ సమయ మార్పులకు శాశ్వతంగా తెరపడే అవకాశం ఉంది.

also read: వైరల్ అయిన గుండు వీడియో వెనుక అసలు నిజం ఇదే.. పెళ్లి కోసం కాదంటున్న కీర్తన మీనన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు