Homeవైరల్వాళ్ల రేంజ్ మారిపోయింది.. అందుకే నన్ను పిలవలేదు..రాధా రవి సంచలన వ్యాఖ్యలు

వాళ్ల రేంజ్ మారిపోయింది.. అందుకే నన్ను పిలవలేదు..రాధా రవి సంచలన వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుటుంబంలో ఇటీవల జరిగిన అవంతిక వివాహ వేడుక కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గోవాలో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుక అనంతరం మరో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నటుడు రాధా రవి తనకు ఆహ్వానం రాకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధా రవిని ఖుష్బూ కుమార్తె పెళ్లికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. పిలవని పేరంటానికి నేను వెళ్లను. ఖుష్బూ పిలవకపోయినా, కనీసం సుందర్.సి అయినా గుర్తు పెట్టుకుని ఆహ్వానిస్తారని అనుకున్నాను. కానీ అలాంటిదేమీ జరగలేదు అని ఆయన అన్నారు. తమ కుటుంబాలతో ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఈసారి పిలవకపోవడం బాధ కలిగించిందని తెలిపారు.

ఓటీటీలోకి సూపర్ హిట్ సింగ్ గీతం … ఎక్కడంటే?

అంతేకాదు, ప్రస్తుతం వారి హోదా, స్థాయి మారిపోయిందేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉండే బంధం ఇప్పుడు కనిపించడం లేదని, కాలం మారడంతో మనుషులు కూడా మారిపోతారని అన్నారు. తాను వారిని ఎప్పుడూ కుటుంబ సభ్యుల్లాగే భావించానని, అందుకే ఈ విషయం తనను నిరాశకు గురి చేసిందని వెల్లడించారు.రాజకీయంగా కూడా తాను వారికి అండగా నిలిచానని రాధా రవి గుర్తు చేశారు. సుందర్.సి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ముందుండి ప్రచారం చేసి పూర్తి మద్దతు ఇచ్చానని చెప్పారు. అప్పుడు నా సహాయం అవసరమైంది. ఇప్పుడు అవసరం తీరిపోయిందేమో. అందుకే నన్ను మర్చిపోయి ఉండొచ్చు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆహ్వానం వచ్చి ఉంటే తప్పకుండా పెళ్లికి వెళ్లి ఆశీర్వదించేవాడినని కూడా స్పష్టం చేశారు.రాధా రవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన ఆవేదనను సమర్థిస్తుండగా, మరికొందరు కుటుంబ వేడుకలకు ఎవరిని ఆహ్వానించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఖుష్బూ లేదా సుందర్.సి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

జై హనుమాన్ షూటింగ్‌లో మాస్ అప్‌డేట్.. 20 రోజుల పాటు రిషబ్-రానా యాక్షన్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు