క్రైమ్ మిర్రర్, సినిమా :- థియేటర్లలో వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సింగ్ గీతం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ ఫాంటసీ కామెడీ మ్యూజికల్ చిత్రం జూన్ 12న విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. మాటలు లేకుండా, కేవలం పాటల ద్వారానే కథను చెప్పిన ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.జూలై 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో వీక్షించవచ్చు.వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అయాన్, అహల్య, షాలిని, తులసి ప్రధాన పాత్రలు పోషించారు. వినూత్న కథ, సంగీత ప్రధానమైన కథన శైలి, విజువల్ ట్రీట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్!
కథ విషయానికి వస్తే.. జైలు నుంచి విడుదలైన ప్రతాప్ అనే యువకుడు తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూముల కోసం కుబేరపురం గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న భూముల్లో బంగారం గనులు ఉన్నాయని తెలుసుకుంటాడు. అదే గ్రామంలో గౌరి అనే యువతి ఒక చెట్టును ప్రాణంలా కాపాడుతూ ఉంటుంది. అయితే బంగారం కోసం ఆ చెట్టును నరికి వేయడంతో గ్రామంపై విచిత్రమైన శాపం పడుతుంది.ఆ శాపం కారణంగా గ్రామ ప్రజలు మాట్లాడే ప్రతి మాట పాట రూపంలోనే బయటకు వస్తుంది. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, ఆశ్చర్యం.. ప్రతి భావోద్వేగాన్ని సంగీతం ద్వారానే వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విచిత్రమైన శాపం నుంచి గ్రామస్థులు ఎలా బయటపడ్డారు? ప్రతాప్ పాత్ర ఈ కథలో ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది? అన్నదే సినిమా ప్రధాన కథ.విభిన్నమైన కథాంశాలు, ప్రయోగాత్మక చిత్రాలను ఇష్టపడే వారికి సింగ్ గీతం మంచి ఎంపికగా నిలుస్తుంది. సంగీతంతో కథను చెప్పిన ఈ అరుదైన ప్రయత్నం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధంగా ఉంది.
జై హనుమాన్ షూటింగ్లో మాస్ అప్డేట్.. 20 రోజుల పాటు రిషబ్-రానా యాక్షన్!