క్రైమ్ మిర్రర్, సినిమా :- 2024 సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సాధించి భారతీయ సూపర్ హీరో చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు ఈ విజయానికి కొనసాగింపుగా రూపొందుతున్న జై హనుమాన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ పూర్తికాగా, ఇందులో అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి మరియు రానా దగ్గుబాటి పాల్గొన్న సన్నివేశాల కోసం దాదాపు 20 రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ నిర్వహించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మునగాకు మహిమ.. ఈ చిన్నపొడి వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా!
ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనుండగా, రానా దగ్గుబాటి కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ , టీ-సిరీస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ కు సంగీతం అందించిన హరిగౌరి ఈ సీక్వెల్‌కూ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలంగా నిలవనున్నాయి.కథ విషయానికి వస్తే.. త్రేతాయుగంలో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన ఒక పవిత్ర వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయాణమే జై హనుమాన్ కథగా ఉండబోతుందనే ప్రచారం సాగుతోంది. భక్తి, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను సమన్వయం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న జై హనుమాన్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. షూటింగ్ నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది.