HomeసినిమాSharvari: ‘ఆల్ఫా’ టీజర్‌లో శర్వరీ ఎక్కడ? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Sharvari: ‘ఆల్ఫా’ టీజర్‌లో శర్వరీ ఎక్కడ? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Alpha Teaser: ఒకే సినిమాలో ఇద్దరు ప్రధాన నటీనటులు ఉన్నప్పుడు వారికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రేక్షకులు ఆశిస్తారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్స్ లో ఇద్దరినీ చూపించకపోతే సోషల్ మీడియాలో విమర్శలు రావడం సహజం. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ఆల్ఫా’ సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో అలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శర్వరీ మిస్సింగ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం 

తాజాగా విడుదలైన టీజర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే, టీజర్‌పై వస్తున్న విమర్శల్లో ఎక్కువగా చర్చకు దారితీసిన అంశం శర్వరీ వాఘ్ మిస్సింగ్. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్‌లో ఆమె ఒక్కసారి కూడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటిని పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పోస్టర్లలో శర్వరీ పేరును ప్రముఖంగా చూపించిన నిర్మాతలు, టీజర్‌లో మాత్రం ఆమెకు చోటు ఇవ్వకపోవడం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు అలియాపై మాత్రమే దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరికొందరు శర్వరీ పాత్రకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచేందుకే ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏ కారణం అయినా సరే, టీజర్‌లో కనీసం ఒక్క సన్నివేశంలోనైనా శర్వరీని చూపించి ఉంటే బాగుండేదని అభిమానులు చెబుతున్నారు.

కాపీ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్

కొందరు టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెబుతుండగా, మరికొందరు హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. టీజర్‌ లోని కొన్ని షాట్లు పాత హాలీవుడ్, ఫ్రెంచ్ యాక్షన్ సినిమాలను గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు పోలికలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ‘లా ఫెమ్మె నికితా’, ‘బ్లాక్ విడో’ వంటి చిత్రాలతో కొన్ని సన్నివేశాలను పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు