Homeతెలంగాణపాడి కౌశిక్ రెడ్డి ఫుల్ సైలెన్స్!

పాడి కౌశిక్ రెడ్డి ఫుల్ సైలెన్స్!

•ఆయన కామెంట్స్ తో పార్టీకి డ్యామేజ్
•గట్టిగానే మందలించిన గులాబీ బాస్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:-
గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు కనిపించడం లేదు? ఆయన ఎందుకు యాక్టివ్ గా లేరు? కారణమేంటి? పార్టీ పెద్దల ఆదేశాలు ఉన్నాయా? లేకుంటే సన్నిహితులు ఎవరైనా సలహా ఇచ్చారా? అసలు ఎందుకు ఆయన సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ ఏ చిన్న సంచలనం జరిగినా.. హుజురాబాద్ నుంచి గచ్చిబౌలి వరకూ ఎక్కడ చిన్నపాటి మైక్ కనిపించినా అక్కడ వాలిపోతారు కౌశిక్ రెడ్డి. నిత్యం ప్రెస్ మీట్ లు, సవాళ్లు- ప్రతి సవాళ్లు, ఓ రేంజ్ లో హడావిడి తో ఉంటారు పాడి కౌశిక్ రెడ్డి. అయితే గత కొద్దిరోజులుగా పొలిటికల్ స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎన్నెన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ఎక్కడ తన మార్కు దూకుడు కనిపించడం లేదు. ఇప్పుడు కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.

చాలా పరిణామాలు జరిగినా..
మొన్న మధ్యన కేంద్రమంత్రి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. దీంతో బండి సంజయ్ వర్గీయులు పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం పై దాడి చేశారు. అటు తరువాత బండి సంజయ్ కుమారుడి వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ వేదికగా చాలా రకాల పరిణామాలు జరిగాయి. మామూలుగా అయితే ఈ ఇష్యులపై కౌశిక్ రెడ్డి తన స్టైల్ లో విరుచుకుపడాలి. కౌంటర్ అటాక్ ఇచ్చి తీరాలి. కానీ ఆయన ఊహించని విధంగా సైలెన్స్ పాటిస్తున్నారు. అయితే గులాబీ బాస్ గట్టిగా మందలించడం వల్లే సైలెంట్ పాటిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఆయన చేస్తున్న అతి పార్టీకి ఇబ్బందికరంగా మారడాన్ని గుర్తించిన అధినేత గట్టిగానే మందలించినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ హై కమాండ్ నుంచి ఆయనకు గట్టి షాక్ లు, స్పష్టమైన హెచ్చరికలు వెళ్ళినట్లు తెలుస్తోంది.

బాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్.. హీరోనే విలన్‌గా మారుతున్నాడా?

అతిగా ప్రవర్తన..
పాడి కౌశిక్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకు పడేవారు ప్రత్యర్థులపై. అవతలి నాయకుల సీనియారిటీని కూడా చూసేవారు కాదు. కడియం శ్రీహరి లాంటి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కౌశిక్ రెడ్డి వైఖరి పార్టీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువగా తెస్తోంది. ముఖ్యంగా తటస్థ ఓటర్ల పై ప్రభావం చూపుతోంది. అందుకే గులాబీ బాస్ తో పాటు చిన్న బాస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. కొద్దిరోజులపాటు సైలెంట్ గా ఉండి పనిచేసుకుని వెళ్లాలని సూచించారట. అందుకే ఈ ఫైర్ బ్రాండ్ నేత సడన్గా సైలెన్స్ పాటిస్తున్నారు. హై కమాండ్ డోస్ ఇవ్వడంతోనే రూటు మార్చారు. అందుకే ప్రెస్మీట్లో సైతం పెద్దగా మాట్లాడడం లేదు. పెద్ద నేతల మధ్య పక్కన అలా ఉండిపోతున్నారు. అయితే ఇది మాత్రం డిజిటల్ మీడియాకు లోటు. కౌశిక్ రెడ్డి నోటి నుంచి వివాదాస్పద మాటలు రాకపోవడంతో యూట్యూబ్ ఛానల్స్ నిరాశతో ఉన్నాయి.

రోడ్డు మీద మ్యాజిక్ చేసిన బాలుడు… ఇప్పుడు స్టార్ అవుతాడా…?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు