Homeసినిమాబాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్.. హీరోనే విలన్‌గా మారుతున్నాడా?

బాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్.. హీరోనే విలన్‌గా మారుతున్నాడా?

•NBK112లో విలన్‌గా రాజశేఖర్ ఎంట్రీ!

క్రైమ్ మిర్రర్, సినిమా :-టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా లేదా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు.గతంలో కొరటాల శివ కథ అందించిన ‘సింహా’ చిత్రం బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్య మాస్ ఇమేజ్‌ను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్‌లో సినిమా వస్తుందనే అంచనాలు పెరిగాయి.

రామ్ చరణ్ కన్నా పవర్‌ఫుల్ ఉపాసనా?

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘NBK 112’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.రాజశేఖర్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ‘ఎక్స్ట్రా’, ‘బైకర్’ వంటి సినిమాల్లో కనిపించారు. అయితే, ఆయనకు పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్‌గా నటిస్తే, ఆయన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి, బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఆర్మీ జ‌వాన్ దారుణ హ‌త్యా…! వివాహేత‌ర సంబంధమే కార‌ణమా…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు