Homeలైఫ్ స్టైల్స్టార్ హీరో నుంచి కష్టాల్లోకి…!

స్టార్ హీరో నుంచి కష్టాల్లోకి…!

  • హార్పిక్ యాడే అన్నం పెట్టింది…

  • స్టార్ హీరో నుంచి కష్టాల్లోకి…

  • అబ్బాస్ జీవితంలోని చేదు నిజాలు

ఇండస్ట్రీ అనేది వెలుగులు, రంగులతో మెరిసే ప్రపంచం. బయటకు చూస్తే గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది… కానీ లోపల ఎన్నో కష్టాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా అందం, వయస్సు ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే… తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో ఒకరు హీరో అబ్బాస్.

‘ప్రేమదేశం’ సినిమా ద్వారా అబ్బాస్ ఒక్కసారిగా యువతలో సంచలనం సృష్టించాడు. ఆ సినిమా తర్వాత ఆయన స్టైల్, హెయిర్‌కట్ ట్రెండ్ అయింది. అప్పట్లో కుర్రాళ్లందరూ “అబ్బాస్ కటింగ్” కోసం బారులు తీరేవారు.
అంతటి క్రేజ్ సంపాదించిన ఆయన… కొంతకాలానికే సినిమాలకు దూరమైపోయాడు.

సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత అబ్బాస్ బుల్లితెరలో హార్పిక్ యాడ్ ద్వారా కనిపించాడు. అయితే ఈ యాడ్ కారణంగా ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. స్టార్ హీరోగా ఉన్న వ్యక్తి ఇలా యాడ్స్ చేయడం ఎందుకని చాలామంది ప్రశ్నించారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అబ్బాస్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టాడు. “సినిమా అవకాశాలు లేని సమయంలో హార్పిక్ బ్రాండ్ నాకు పెద్ద సహాయం చేసింది. దాదాపు 8 సంవత్సరాలు ఆ యాడ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవించాం. నిజంగా చెప్పాలంటే… ఆ యాడ్ వలననే నా ప్లేట్‌లో అన్నం పడింది” అని భావోద్వేగంగా చెప్పాడు.

విమర్శలు వచ్చినా కూడా తన కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయమని, వాటిని పెద్దగా పట్టించుకోలేదని ఆయన వెల్లడించాడు.

కొంతకాలం గ్యాప్ తర్వాత అబ్బాస్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వచ్చిన ‘హ్యాపీ రాజ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వరుస అవకాశాలతో తిరిగి బిజీగా మారుతున్నాడు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు